యోగి సర్కార్ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళా ఉద్యోగులు నైట్ షిఫ్ట్‌లలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక భద్రతా నిబంధనలు, అవసరమైన మార్గదర్శకాలను అమలు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో మహిళలకు అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.