చింతపల్లిలో కాఫీ తోటల పరిశీలన

చింతపల్లిలో కాఫీ తోటల పరిశీలన

ASR: చింతపల్లి మండలం కోరుకొండ, బురుసింగి, ఉమ్మరాజగొంది, తాజంగి గ్రామాల్లో బుధవారం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి, సైంటిస్ట్‌లు బయ్యపురెడ్డి, సందీప్, ఏవో మధుసూధనరావు బృందం పర్యటించింది. కాఫీ రైతులతో మాట్లాడి.. తోటలను పరిశీలించారు. ప్రస్తుతం ఆయా తోటల్లో బెర్రీ బోరర్ తెగులు సోకలేదని నిర్ధారించారు. అయితే తెగులు సోకే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.