కొడంగల్‌లో కాంగ్రెస్ జోరు..!

కొడంగల్‌లో కాంగ్రెస్ జోరు..!

VKB: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 12 వార్డులకు గాను 10 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా 4వ వార్డులో మాజీ ఎమ్మెల్యే మనుమడు నందారం ప్రశాంత్ ఘన విజయం సాధించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM) పార్టీలు కేవలం ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి.