అక్రమ ఇసుక రవాణా.. ట్రాకర్లు సీజ్

అక్రమ ఇసుక రవాణా.. ట్రాకర్లు సీజ్

WNP: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలోని కృష్ణానది నుంచి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఇవాళ తెల్లవారుజామున డ్యూటీ కానిస్టేబుళ్లు ఆపి అను మతి పత్రాలు కోరారు. వాటిని చూపకపోవడంతో ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.