మిర్యాలగూడ మాజీ MLAకు CM వార్నింగ్..!
NLG: మిర్యాలగూడలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో కాంగ్రెస్ తరఫున గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో చేరి కేసీఆర్ కాళ్ల దగ్గర కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.