విజయనగరంలో " హర్ ఘర్ తిరంగా" ర్యాలీ

VZM: ఆగస్టు15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కోట జంక్షన్ నుంచి గంటస్తంభం జంక్షన్ వరకు 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు, తూర్పు కాపు రాష్ట్ర ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి పాల్గొని ప్రజలలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపారు.