VIDEO: మ్యాట్రిమోనీలో పరిచయం.. రూ.20 లక్షల స్వాహా
WGL: వర్ధన్నపేట పట్టణానికి చెందిన సత్యనారాయణ అనే యువకుడు మ్యాట్రిమోనీలో పరిచయమైన మంజుల అనే మహిళ చేతిలో మోసపోయాడు. మంజుల పెళ్లి చేసుకుందాం అని నమ్మించి రూ.20 లక్షలకు పైగా డబ్బులు కాజేసినట్లు బాధితుడు తెలిపాడు. ఆమె ఇప్పటికే వివాహిత అని తెలియడంతో నేడు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.