నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

VZM: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలబడాలని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ నేతలు చీపురుపల్లి మండలంలో మంగళవారం పర్యటించారు. పత్తికాయ పాలవలసలో నేలకొరిగిన అరటి, బొప్పాయి పంటలను జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, తదితరులు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.