'అర్ధరాత్రి వేళల్లో బయట తిరిగితే కేసులు నమోదు చేస్తాం'

'అర్ధరాత్రి వేళల్లో బయట తిరిగితే కేసులు నమోదు చేస్తాం'

VZM: సరైన కారణం లేకుండా అర్ధరాత్రి వేళల్లో పట్టణాల్లో తిరిగితే టౌన్ న్యూసెన్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు ప్రతిరోజు సీఐ స్థాయి అధికారితో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు టౌన్ న్యూసెన్స్ చట్టం కింద 3,573 మందిపై కేసులు నమోదు చేసామన్నారు.