'అఖండ 2'లో స్పెషల్ సర్‌ప్రైజ్!
నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం 'అఖండ 2'. ఈ నెల 5న ఇది రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమాలో స్పెషల్ సర్‌ప్రైజ్ ఉన్నట్లు సోషల్ మీడియలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో 'పరమశివుని రుద్ర తాండవం' సీన్‌లో దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్‌ను AI ద్వారా చూపించనున్నారట. కాగా, దీనిపై మూవీ రిలీజ్ తర్వాతే క్లారిటీ రానుంది.