లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

BDK: కొత్తగూడెం వెళ్తున్న మణుగూరు ఆర్టీసీ బస్సు లక్ష్మీపురం వద్ద ఆగి ఉన్న లారీని ఈరోజు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకునే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రయాణికుల అందరినీ మరో బస్సులో తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.