ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలోని APSP 11వ పోలీసు బెటాలియన్లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెటాలియన్ కమాండెంట్ కే.ఆనంద రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమాండెంట్ రాజ్యాంగం పట్ల వినయ విధేయత ఉంటామని బెటాలియన్ పోలీసులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.