ఆ స్టార్ హీరో నా క్లాస్‌మేట్.. శృతి హాసన్ వ్యాఖ్యలు

ఆ స్టార్ హీరో నా క్లాస్‌మేట్.. శృతి హాసన్ వ్యాఖ్యలు

హీరోయిన్ శృతి హాసన్ తన పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ గురించి తెలిపారు. దుల్కర్ తాను బాల్యంలో చెన్నైలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. ఆ సమయంలో తరచూ కలుసుకునేవారమని పేర్కొన్నారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. కాగా తాజాగా దుల్కర్‌తో కలిసి ఆమె ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.