VIDEO: వాగులో మృతదేహం కలకలం
SKLM: వజ్రపుకొత్తూరు మండలం ఉండ్రుకుడియా గ్రామ సమీపంలోని వాగులో మృతదేహం కలకలం రేపింది. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు లోత్తూరు పంచాయతీ చిన్ పలియా గ్రామానికి చెందిన సవర భాస్కరరావు(36)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.