పోలీసు కుటుంబాలకు అండగా పోలీసుశాఖ

పోలీసు కుటుంబాలకు అండగా పోలీసుశాఖ

కృష్ణా: పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు అన్నారు. హెడ్‌ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ మరణించిన కుటుంబాలకు మంజూరైన బీమా చెక్కులను గురువారం జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది అకాల మరణాలు పోలీసు శాఖకు తీరని లోటు అని అన్నారు.