శివకుమార్‌కు 'మణిపూసల బాలక విభూషణ్' పురస్కారం

శివకుమార్‌కు 'మణిపూసల బాలక విభూషణ్' పురస్కారం

NRPT: దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఎం.శివకుమార్ గోల్కొండ సాహిత్య సమితి నుంచి 'మణిపూసల బాలక విభూషణ్' పురస్కారాన్ని అందుకున్నాడు. శ్రీపాద వడిచర్ల సత్యం రూపొందించిన ప్రక్రియలో శతాధిక కవితలు రాసినందుకు ఈ గౌరవం లభించింది. 9వ తరగతి చదువుతున్న శివకుమార్ ప్రతిభను చూసి తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.