'మెనూ అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులదే'
ADB: ఉట్నూరు మండల కేంద్రంలోని KB కాంప్లెక్స్‌లో ఇవాళ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, మెనూ అమలు బాధ్యత HMలదేనని పేర్కొన్నారు.