VIDEO: వెల్దుర్తిలో ఆటో కార్మికుల నిరసన

KRNL: వెల్దుర్తి పాత బస్టాండ్ వద్ద సోమవారం ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. జీవో నంబర్ 21, 31 రద్దు చేయాలని, వాహనమిత్ర పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు నెలకు రూ. 5000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్‌తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.