చేబ్రోలులో జనసేన కార్యాలయం మార్పు

చేబ్రోలులో జనసేన కార్యాలయం మార్పు

KKD: పిఠాపురం మంగయ్యమ్మరావుపేటలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండటంతో, దాన్ని చేబ్రోలు హైవేలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాస భవనానికి మారుస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు గురువారం తెలిపారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ఆరునెలల్లో పిఠాపురంలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.