ఆపరేషన్ సింధూర్: 80 మంది ఉగ్రవాదులు మృతి?

ఆపరేషన్ సింధూర్: 80 మంది ఉగ్రవాదులు మృతి?

పాక్‌పై భారత్ జరిపిన మెరుపుదాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. లష్కర్-ఇ-తోయిబా ప్రధాన కార్యాలయంగా ఉండే మర్కజ్ తోయిబా మదర్సా, జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన బవహల్పూర్‌లోని ఉస్మాన్-ఒ-అలీ క్యాంపులో ఒక్కోదాంట్లో 25-30 మంది మృతి చెందినట్లు సమాచారం. కాగా.. ఇప్పటివరకు తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు జరిగాయి. అయితే మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.