ఏఆర్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి
కృష్ణా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు నలుగురు ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్‌కు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పించారు. విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, క్రమశిక్షణ, సేవలను గుర్తించి ఈ పదోన్నతులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. పదోన్నతి పొందిన సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలన్నారు.