ఘనంగా ఉయ్యాలవాడ గంగమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ

ఘనంగా ఉయ్యాలవాడ గంగమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ

NDL: ఉయ్యాలవాడ గంగమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం భక్తుల సందోహం మధ్య ఘనంగా జరిగింది. వేద పండితులు దక్షిణామూర్తి, భాస్కర శర్మల ఆధ్వర్యంలో యంత్ర, విగ్రహ ప్రతిష్ఠలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. వేలాది మంది భక్తులు పాల్గొనగా, ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. భక్తుల సౌకర్యార్థం కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.