అక్రమంగా కబేలాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
NLG: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు TS 29T 0342 నెంబరు గల బొలెరో వాహనంలో అక్రమంగా కబేలాకు తరలిస్తున్న 3 ఆవులు, 5 కోడెలను గురువారం నార్కట్‌పల్లిలో పట్టుకున్నట్లు ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. నల్గొండ ఫ్లైఓవర్ వద్ద వీటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించామని అన్నారు. నిందితులు సత్తెనపల్లి నరసింహారావు, షేక్ అక్రమ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.