'మా ఊరి కోతి పంచాయితీ'ని నెగ్గితేనే సర్పంచ్ పీఠం!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 'కోతుల పంచాయితీ' అనే కొత్త పేరు స్థిరపడింది. సాధారణ ఎన్నికల్లో తాగునీరు, రోడ్ల సమస్యలైతే ఇక్కడ మాత్రం కోతుల బెడద సమస్యగా మారింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల ముందు ప్రజలు పెడుతున్న ఏకైక డిమాండ్.. గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరించాలి. దీనికి పరిష్కారం చూపిన వారికే తమ ఓటు వేస్తామంటున్నారు.