పెట్టికోట శివాలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ

పెట్టికోట శివాలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున పాల్గొని శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకాలు, కుంకుమార్చన అనేక పూజలను చేశారు. ఓం నమశ్శివాయ అంటూ భక్తులు శివనామస్మరణాన్ని చేసుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.