బెంగాల్‌లో 58 లక్షల ఓట్లు తొలగింపు
పశ్చిమబెంగాల్‌లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విమర్శలు వస్తున్న వేళ కీలక పరిణామం జరిగింది. తాజాగా ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 58 లక్షల ఓట్లను తొలగించారు. ఇందులో 24 లక్షల మంది మృతిచెందినట్లు, 19 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడినట్లు, 12 లక్షల మంది ఆచూకీ లేనట్లు, 1.3 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.