హెచ్చరిక.. ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు తగ్గే ఛాన్స్
TG: చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజారోగ్య శాఖ హెచ్చరించింది. 'రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు వెంటనే వైద్యులను సంప్రదించాలి' అని సూచించింది.