అదుపుతప్పి బోల్తా పడ్డ ఆటో.. పలువురికి తీవ్ర గాయాలు

అదుపుతప్పి బోల్తా పడ్డ ఆటో.. పలువురికి తీవ్ర గాయాలు

KMM: కల్లూరు పట్టణంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.