నేరాల కట్టడికి రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
సత్యసాయి: మహిళలు, బాలికలపై జరిగే నేరాలను కట్టడి చేసే దిశగా జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ కఠిన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా, ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిల్ పోలీస్ స్టేషన్లలో నేరస్తులు, రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళలను వేధించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.