నూతన పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: పెనుగంచిప్రోలు తూర్పు బజారు ఎస్సీ కాలనీలో అర్హత పొందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య స్వయంగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి దూరదృష్టి, సంకల్పమే ఈరోజు వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు. కొత్తగా పెన్షన్ పొందిన లబ్ధిదారులు తమకు వచ్చిన ఈ ఆర్థిక సాయం జీవితంలో ఎంతో ఉపయుక్తమని చెప్పారు.