డ్రంకెన్ డ్రైవ్‌లో 246 కేసులు నమోదు: సీపీ
NZB: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 7 వరకు జరిగిన తనిఖీల్లో 246 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ కేసుల్లో 16 మందికి కోర్టులు జైలు శిక్ష విధించగా, రూ. 20.30 లక్షల జరిమానా విధించారు. సీపీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 17 మౌఖిక విచారణ కేసులను త్వరగా పరిష్కరించి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.