ట్రైనీ ఐఏఎస్‌కు కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు

ట్రైనీ ఐఏఎస్‌కు కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు

NZB: భీమ్‌గల్‌లో బంగారు దుకాణాల ముందున్న కూరగాయల మార్కెట్‌ను మరొక స్థలానికి తరలించడానికి కృషి చేసిన ట్రైని ఐఏఎస్ అధికారికి వర్తకులు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఆమెను శాలువా, పూలమాలతో సత్కరించారు. సమస్యను గుర్తించి మార్కెట్‌ను పాత MRO కార్యాలయం స్థలాలంలోకి మార్చడం పట్ల వ్యాపారులు ధన్యవాదాలు తెలిపారు.