ఇంటర్ ఫలితాల్లో అదరగొట్టిన అన్నదమ్ములు

ఇంటర్ ఫలితాల్లో అదరగొట్టిన అన్నదమ్ములు

SRPT: మఠంపల్లి మండలం మంచ్యాతండాకు చెందిన అన్నదమ్ములు గౌతమ్ నాయక్, మనోజ్ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫీల్డ్ అసిస్టెంట్ రవి నాయక్ కుమారులైన వీరిలో గౌతమ్ ద్వితీయ సంవత్సరంలో 988/1000 మార్కులు, మనోజ్ ప్రథమ సంవత్సరంలో 467/470 మార్కులు సాధించారు. ఒకే ఇంట్లో ఇద్దరు టాపర్లుగా నిలవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.