VIDEO: భూ, రెవెన్యూ సమస్యల మీద అధిక ఫిర్యాదులు
AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి బి.వెంకటరమణ ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ సమస్యల మీద అధికంగా 23 ఫిర్యాదులు అందజేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని ఏవో వెంకటరమణ సూచించారు.