పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
KMR: తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామ శివారులో పేకాట శిబిరంపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12,030 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.