ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చలే..!
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై నగరం అంతా చర్చించుకుంటుంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?, ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు.?, గెలిచే అవకాశం ఎవరికి ఉంది?, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఫలితాలు నిజమేనా?.. అనే అంశాలపై చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కలిసినా, టీ స్టాళ్లు, హోటళ్లు వీటికి వేదికగా మారుతున్నాయి. మొత్తం మీద మరొక్క రోజులో గెలుపు, ఓటములు డిసైడ్ కానుంది.