కొలనుపాకలో సోమేశ్వరస్వామి మహా ప్రదక్షిణ
యాదాద్రి: ఆలేరు మండలం కొలనుపాకలో ప్రాచీన దేవాలయం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా మహా ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ప్రదక్షిణలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ, ఆలయాన్ని చుట్టి వచ్చి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.