'ఏఐటీయూసీ నిరంతరం పోరాటం చేస్తుంది'
ప్రకాశం: కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ అన్నారు. ఏఐటీయూసీ జిల్లా మహాసభలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో గురువారం మార్కాపురం ప్రెస్ క్లబ్లో పలు ముఖ్యమైన తీర్మానాలు, డిమాండ్లను వారు వెల్లడించారు. వెనుకబడిన మార్కాపురం జిల్లాగా ప్రకటించి, జిల్లా అభివృద్ధికి రూ. 10వేల కోట్లు కేటాయించాలన్నారు.