స్వచ్ఛంద రక్తదానం అభినందనీయం: కలెక్టర్
CTR: గ్రామ సర్వేయర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా చిత్తూరు రెవెన్యూ భవనంలో గ్రామ సచివాలయ సర్వేయర్లు నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్త నిల్వల సమస్యలు పరిష్కరించేందుకు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.