మారెళ్లలో ఉచిత వైద్య శిబిరం

ప్రకాశం: ముండ్లమూరు మండలం మారెళ్లలో సోమవారం ఉచిత వైద్య పరీక్ష శిబిరం జరిగింది. ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని డాక్టర్ రామంజనేయులు తెలిపారు. డాక్టర్లు సునీల్, గురవయ్య 100 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరం అయిన వారికి మందులు పంపిణీ చేశారు.