నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
కరీంనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సలీం తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. పోచమ్మ గుడి నుంచి వన్ హాస్పిటల్ వరకు ప్రయాణించిన వారు తమ బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. అందులో రూ. 1.20 లక్షల నగదు ఉండగా, సలీం వెంటనే స్పందించి బాధితులకు ఆ బ్యాగును క్షేమంగా అందజేశాడు. నగదును తిరిగి పొందిన ప్రయాణికులు సలీంకు కృతజ్ఞతలు తెలిపారు.