ఎడపల్లిలో యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

ఎడపల్లిలో యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

NZB: ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారం శివారులో నిజామాబాద్-బోధన్ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి ఎడపల్లి వెళ్తున్న కారు ముందు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.