VIDEO: కార్యాలయాల ముట్టడికి అఖిల పక్ష కమిటీ పిలుపు

GDWL: అయిజ అఖిల పక్ష కమిటీ ఈ నెల 15న సోమవారం పలు కార్యాలయాల ముట్టడికి శనివారం పిలుపునిచ్చింది. పట్టణంలోని గాజులుపేట, మడ్డిగుంట, తెలుగుపేట, దుర్గానగర్, సంతబజార్ వంటి కాలనీల్లో చిన్నపాటి వర్షానికే మునిగిపోతున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, సీసీ రోడ్లు నిర్మించాలని ఈ కమిటీ డిమాండ్ చేసింది. అలాగే, నూతన బస్టాండ్ నిర్మాణం చేయాలని కోరింది.