జిల్లాలో 2,034.97 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు

SRCL: జిల్లాలో రైతులు ఆయిల్ పాం సాగుపై దృష్టి సారించారు. ముఖ్యంగా జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో అత్యధికంగా సాగు చేశారు. డిమాండ్ ఉన్న పంటలు వేస్తే లాభం ఉంటుందని, ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉండడంతో దీనిపై దృష్టి సారించినట్లు వారు తెలిపారు. జిల్లాలో 2022 నుంచి ఇప్పటివరకు 657 మంది రైతులు 2,034.97 ఎకరాల్లో ఆయిల్ పాం తోటలను సాగుచేశారు.