'వంట గ్యాస్ కొరత లేదు.. పుకార్లను నమ్మకండి'
BDK: జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సాఫీగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని తెలిపారు. అధికారిక మాధ్యమాల ద్వారా బుక్ చేసుకుని సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలో 26 గ్యాస్ పంపిణీ కేంద్రాలు పనిచేస్తూన్నాయన్నారు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు.