36 గంటలు నీటి సరఫరా బంద్

36 గంటలు నీటి సరఫరా బంద్

MBNR: దేవరకద్ర, NRPT, మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. శ్రీనివాస్ తెలిపారు. దెబ్బతిన్న పైప్ భాగాన్ని కొత్త పైపుతో మార్చేందుకు ఈ షట్‌డౌన్ చేపడుతున్నామని చెప్పారు. నేటి నుంచి 11వ తేదీ ఉదయం వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉండనున్నందున ప్రజలు సహకరించాలని కోరారు.