VIDEO: ఖాళీగా దర్శనమిస్తున్న జేబీఎస్ బస్టాండ్
HYDలో జేబీఎస్ బస్టాండ్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఖాళీగా దర్శనమిస్తుంది. అనునిత్యం సుమారుగా 1450 బస్సులు వివిధ జిల్లాలకు సర్వీసులు అందిస్తుంటాయి. కానీ ప్రస్తుతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే సర్వీసులు అందిస్తున్నట్లు అక్కడ ఉన్న ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు.