మంత్రికు ధన్యవాదాలు తెలిపిన ప్రజలు

VZM: గజపతినగరం మండలంలోని ఎం.కొత్తవలసకు బస్సు సౌకర్యం ఆదివారం నుంచి కల్పించినందుకు ప్రజలు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. నెల రోజుల క్రితం తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. హామీ మేరకు బస్సు సౌకర్యం కల్పించినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.