టీమిండియా సెలక్టర్లపై అశ్విన్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల వైఖరిపై భారత మాజీ క్రికెటర్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాంచీ వేదికగా జరిగిన మొదటి వన్డేలో నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు కల్పించకపోవడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు. నితీష్ రెడ్డిని కేవలం బెంచ్‌కే పరిమితం చేయడం సరైంది కాదని పేర్కొన్నాడు. రేపు రాయ్‌పూర్ వేదికగా జరిగే రెండో వన్డేలో అయిన అతడిని జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.