సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
సత్యసాయి: పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు 26,66,627 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి సవిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు జబ్బు చేస్తే చికిత్స కోసం ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారన్నారు.